Upcoming 5G Phones June 2023: ఈ నెలలో లాంచ్ కాబోతున్న అదిరిపోయే స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Upcoming 5G Smart Phones in India: తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. మరి జూన్ నెలలో లాంఛ్ కాబోతున్న మెుబైల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.
Upcoming 5G Smart Phones in India: మంచి స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఈ నెలలో బ్రాండెడ్ కంపెనీల నుంచి అదిరిపోయే ఫోన్లు లాంఛ్ కాబోతున్నాయి. రియల్ మీ, ఐకూ, సామసంగ్ మరియు ఒప్పో కంపెనీల తమ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. ఏయే మెుబైల్స్ ఈ జూన్ లో సందడి చేయబోతున్నాయో ఓ లుక్కేద్దాం.
1. Realme 11 series
ఈ నెలలో రియల్ మీ.. 11 ప్రో, 11 ప్రో+ మెుబైల్స్ ను లాంఛ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్లపై ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో విడుదలయ్యాయి. జూన్ 08 నుంచి ఈ స్మార్ట్ ఫోన్లు ఇండియా మార్కెట్ లో సందడి చేయబోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను జూలై 08 నుంచి 14 వరకు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఆర్డర్ పెట్టిన వారికి రూ. 4, 499 విలువ చేసే రియల్ మీ వాచ్ ప్రో లభించనుంది
ఫీచర్లు
రియల్ మీ 11 ప్రో+ 200 మెగాఫిక్సల్ ప్రైమరీ సెన్సర్ కలిగిన కెమెరాతో రాబోతుంది. ఈ ఫోన్ లో ఇదే హైలెట్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా 120Hz కర్వ్ డ్ డిస్ ప్లే తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమన్సిటీ 7050 చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇది 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రియల్ మీ 11 ప్రో విషయానికొస్తే.. ఇది 108 మెగా ఫిక్సల్ కెమెరాను కలిగి.. ఓఐఎస్ తో రాబోతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంది.
2. iQOO Neo 7 Pro
ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 20న భారత మార్కెట్లో లాంఛ్ కానుంది. ఇది 6.78 inchs, 120hz ఎమెలోడ్ డిస్ ప్లే తో రాబోతుంది. ఇది క్వాల్కమ్ స్మాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ను కలిగి ఉంది. బ్యాక్ 50 మెగాపిక్సల్, ఫ్రంట్ 32 మెగా ఫిక్సల్ కెమెరాతో రాబోతుంది. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ 8 GB RAM / 128 GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
Also Read: Automatic Cars: దేశంలో అత్యంత చౌకగా లభించే టాప్ 5 ఆటోమేటిక్ కార్లు ఇవే
3. Oppo F23 Pro
ఇది ఈ నెల 16న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పో ఎఫ్ 23 ప్రో మెుబైల్ 6.72 అంగుళాల ఎమెలోడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్నాఫ్ డ్రాగన్ 695 ప్రోసెసర్ తో రాబోతుంది. ఇందులో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీనిని 1 టీబీ వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. దీని ధర 25 వేల లోపు ఉండవచ్చు.
4. Samsung Galaxy F54
సామ్ సంగ్ ఫోన్లను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇవాళే గెలాక్సీ ఎఫ్ 54 స్మార్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోసందడి చేయబోతుంది. ఈ మెుబైల్ 108 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరాతో రాబోతుంది. ఇది 120hz ఎమోలోడ్ డిస్ ప్లేతో రాబోతుంది. ఈ ఫోన్ అండ్రాయిడ్ 13 వెర్షన్ తో రాబోతుంది. అంతేకాకుండా ఇది Exynos 1380 చిప్ సెట్ ను కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి